బాసర ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
బాసర ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ ఆలయ అభివృద్ధి ఉండాలన్నారు. హైదరాబాద్ ఏప్రిల్ 4 (మహాప్రభ) : బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈరోజు(శనివారం) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను సీఎంకు అధికారులు వివరించారు. మాస్టర్ ప్లాన్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం. ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు...