కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అన్ని విషయాల్లో ఏకరూపత కోరుకునే బీజేపీ.. బంధువుల విషయానికి వస్తే రెండు ప్రమాణాలను పాటిస్తోందంటూ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ మే 13 ( మహాప్రభ ) : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు అవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. భగీరథ్ తనను లైంగికంగా వేధించాడంటూ బాలిక చేసిన ఫిర్యాదు మేరకు పేట్‌బషీర్‌బాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. బీజేపీ నేతలు మాత్రం ఈ విషయాన్ని రాజకీయ కుట్రగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. భగీరథ్ కేసుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. సోషల్ మీడియా ఎక్స్‌లో సంచలన పోస్ట్ చేశారు. అన్ని విషయాల్లో ఏకరూపత కోరుకునే బీజేపీ.. బంధువుల విషయానికి వస్తే రెండు ప్రమాణాలను పాటిస్తోందంటూ సెటైర్ విసిరారు.
కేటీఆర్ ట్వీట్..
‘ఒక దేశం – ఒక పన్ను.. వన్ నేషన్ – వన్ ఎలక్షన్.. అన్ని విషయాల్లో ఏకరూపత ఉండాలని బీజేపీ కోరుకుంటోంది. కానీ వారి బంధువులను రక్షించే విషయానికి వస్తే.. ఒక పోక్సో చట్టం – కానీ రెండు ప్రమాణాలు. ఒకటి కేంద్ర మంత్రి కొడుకు కోసం, మరొకటి సామాన్యుల కోసం’ అంటూ కేటీఆర్ పోస్ట్ చేస్తూ.. #పోక్సో, #బేటీ బచావో అంటూ జతపరిచారు.