ఫరూఖ్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. కారణం ఏంటో చెప్పిన నిందితుడు..
ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాపై 63 ఏళ్ల కమల్ సింగ్ జమ్‌వాల్ తుపాకితో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. సిబ్బంది అప్రమత్తం అవ్వటంతో పెను ప్రమాదం తప్పింది. న్యూఢిల్లీ, మార్చి 12 మహాప్రభ : జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాపై బుధవారం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. జమ్మూ గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలోని హోటల్ రాయల్ పార్క్‌లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయనపై 63 ఏళ్ల కమల్ సింగ్ జమ్‌వాల్ తుపాకితో పాయింట్...