ప్రమాదవశాత్తూ గుంతలో పడిపోయిన 8 మంది.. ఏం జరిగిందంటే..

ముంబైలో ప్రమాదవశాత్తూ గుంతలో పడి 8 మంది యువకులకు తీవ్రగాయాలు అయ్యాయి. నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. ముంబై ఏప్రిల్ 24 (మహాప్రభ) : ఓ భవనంలో ప్రమాదం జరిగి 8 మంది గాయపడిన ఘటన పశ్చిమ భాండూప్‌లోని మెట్రో మాల్ సమీపంలో చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ గోతిలో పడడంతో బాధితులకు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు, పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో...