పాత ఇళ్లు, పాత ఫ్రెండ్స్.. ఎప్పుడైనా వెళ్తా, ఎప్పుడైనా వస్తా: రాజాసింగ్
అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయంలోకి వెళ్లడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. ‘పాత ఇళ్లు, పాత ఫ్రెండ్స్.. ఎప్పుడైనా వెళ్తా, ఎప్పుడైనా వస్తా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్, మార్చి 16 మహాప్రభ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయంలోకి వెళ్లి బీజేపీ ఎమ్మెల్యేలతో కాసేపు ముచ్చటించారు. బీజేపీ ఎమ్మెల్యేలు, లెజిస్లేటివ్ పార్టీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి కార్యాలయంలో కూర్చున్న రాజాసింగ్.. పార్టీ నిర్ణయాలు, విధి విధానాలపై మరోసారి చర్చించారు. బీజేఎల్పీలోకి వెళ్లడంపై ఎమ్మెల్యే మాట్లాడుతూ... ‘పాత ఇళ్లు,...