పాకిస్థాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఇవి ఏమాత్రం సహించరానివని స్పష్టం చేసింది. ఏప్రిల్ 10 (మహాప్రభ) : ప్రస్తుతం ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం అత్యంత క్లిష్ట దశలో ఉంది. ఈ సమయంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు....