mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 6:44 am Digital Edition : Namastey Mahaaprabha

పసిడి, రజతం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్

ఫిబ్రవరి 17 మహాప్రభ :ఇటీవల ఆకాశాన్ని తాకిన బంగారం, వెండి ధరలు క్రమక్రమంగా నేలకు దిగి వస్తున్నాయి. తాజాగా పుత్తడి, రజతం ధరలు నిన్నటి కంటే ఈ రోజు మరి కాస్తా తగ్గాయి. ఈ రోజు వీటిని కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.అమెరికా ఆర్థిక గణాంకాలు వెలువడుతున్న వేళ.. భారత దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు.. సోమ, మంగళవారాల్లో ఆకాశం నుంచి భూమికి దిగి వస్తున్నాయి. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకున్న అనిశ్చితి దీనికి కారణమని అంచనాలు వెలువడుతున్నాయి.

పది గ్రాముల బంగారం ధర మళ్లీ రూ. లక్షకు దిగువకు వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం ఉదయం 11.00 గంటలకు రూ.1,55,060గా ఉంది. ఇదే బంగారం ధర నిన్న అంటే సోమవారం రూ.1,56,590గా ఉంది. అంటే ఈ రోజు బంగారం ధర రూ. 1,530 మేర తగ్గింది. ఇక మంగళవారం వెండి కిలో ధర రూ. 2,60,000గా ఉంది. ఇదే వెండి సోమవారం రూ. 2,68,000గా ఉంది. అంటే కిలో వెండి ధర ఈ రోజు రూ. 8 వేలు తగ్గింది.ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,54,910గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.1,530 తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,000గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ. 1,400 తగ్గింది. అలాగే దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,060కి దిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,42,150గా ఉంది.

అలాగే వెండి కూడా భారీ తగ్గుదల నమోదు చేసుకుంది. రూ.2.7 లక్షల మార్క్‌ దిగువనే కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు ఏకంగా రూ. 8 వేల మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,65000గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కిలో వెండి ధర రూ.2,60000గా ఉంది.