mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 9:01 am Digital Edition : MAHAA PRABHA DAILY

పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.. లోక్‌సభలో ప్రధాని మోదీ

పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. యుద్ధం ఎన్నో సవాళ్లు తీసుకొచ్చిందన్న ప్రధాని.. పశ్చిమాసియాలో కోటి మందికిపైగా భారతీయులున్నారని, వారి రక్షణకు చర్యలు చేపట్టామని లోక్‌సభకు వెల్లడించారు.

న్యూఢిల్లీ, మార్చి 23 మహాప్రభ : పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన లోక్ సభలో మధ్యప్రాశ్యంలో యుద్ధం గురించి లోక్ సభలో ప్రసంగించారు. మూడు వారాలుగా యుద్ధం కొనసాగుతోందన్న ప్రధాని మోదీ.. భారత్‌ ఇంధన అవసరాలను పశ్చిమాసియా తీరుస్తోందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ యుద్ధం భారత్‌కు ఎన్నో సవాళ్లు తీసుకొచ్చిందని మోదీ అన్నారు.పశ్చిమాసియాలో కోటి మందికిపైగా భారతీయులు ఉన్నారని, గల్ఫ్‌లో ఉన్న భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టామని ప్రధాని మోదీ లోక్ సభకు చెప్పారు. ప్రజలపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపిస్తోందని కూడా ప్రధాని మోదీ వెల్లడించారు.