mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 6:07 am Digital Edition : Namastey Mahaaprabha

పల్నాడు జిల్లాలో విషాదం.. ప్రాణం తీసిన మస్కిటో కాయిల్

దోమల బారి నుంచి రక్షణ కోసం వెలిగించిన మస్కిటో కాయిల్ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి గ్రామంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

సత్తెనపల్లి ఏప్రిల్ 23 (మహాప్రభ) : దోమల బారి నుంచి రక్షణ కోసం వెలిగించిన మస్కిటో కాయిల్ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాగేశ్వరరావు (58) అనే వ్యక్తి సజీవ దహనమయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉండటంతో.. కంటెపూడికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి.. రాత్రి నిద్రపోయే ముందు మస్కిటో కాయిల్ వెలిగించారు. నిద్రపోతున్న సమయంలో మస్కిటో కాయిల్ నుంచి వెలువడిన నిప్పురవ్వ ప్రమాదవశాత్తు ఆయన కప్పుకున్న దుప్పటికి అంటుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో.. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పలువురు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదవశాత్తు చనిపోయాడా లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.