పరమేశ్వరుడికి పాగాలంకరణ
ముక్కంటీశుని దర్శనానికి భక్తకోటి కదలిరాగ ఇల కైలాసం శ్రీశైలం పులకించింది. వైభవంగా బ్రహ్మోత్సవ కల్యాణం భక్తజన సంద్రంగా శ్రీశైల క్షేత్రం లింగోద్భవకాల మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీశైలం, ఫిబ్రవరి 16మహాప్రభ : ముక్కంటీశుని దర్శనానికి భక్తకోటి కదలిరాగ ఇల కైలాసం శ్రీశైలం పులకించింది. లయకారుడైన పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించిన శివరాత్రివేళ శ్రీశైల మహా క్షేత్రం భక్తజనసంద్రమైంది. ఆదివారం మల్లన్న ప్రభోత్సవం, పాగాలంకరణ ఘట్టం, ఆదిదంపతుల బ్రహ్మోత్సవ లీలా కళ్యాణ వేడుకలను చూసి భక్తులు పులకించిపోయారు. రాత్రి నందివాహనంపై భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి...