‘నా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు’: సీఎం చంద్రబాబు
'మా రాజధాని అనే చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఆమోదం తెలిపినందుకు, నా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను': సీఎం చంద్రబాబు అమరావతి ఏప్రిల్ 7 (మహాప్రభ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026'కు గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆమోద...