mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 6:55 am Digital Edition : Namastey Mahaaprabha

నాంపల్లి సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు..

నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు అందింది. దీంతో శుక్రవారం కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదులు, కక్షిదారులను ఆగమేఘాల మీద బయటకు పంపి.. ఆ ప్రాంగణంలో బాంబు, డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 20 మహాప్రభ : నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. శుక్రవారం కోర్టు సిబ్బందికి ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లకు కోర్టు సిబ్బంది సమాచారం అందించారు. వారంతా కోర్టు వద్దకు చేరుకుని.. ప్రాంగణంలో న్యాయవాదులు, కక్షిదారులను ఆగమేఘాల మీద బయటకు పంపారు. అనంతరం కోర్టు ప్రాంగణంలో బాంబు, డాగ్ స్వ్కాడ్‌ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. కోర్టులో బాంబు అమర్చామని.. దీనికి టైమ్ సైతం సెట్ చేశామని.. అది పేలబోతుందంటూ దుండగులు ఈ మెయిల్ ద్వారా సిబ్బందిని బెదిరించారు. దాంతో పోలీసులు కోర్టు ప్రాంగణంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు.