mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 6:06 am Digital Edition : Namastey Mahaaprabha

నమస్తే మహాప్రభ హెడ్ ఆఫీస్‌కు విచ్చేసిన మహేశ్వరం కృష్ణయ్య.

– ఘనంగా సన్మానించిన మహాప్రభ అధినేత ( ఆరుహి గ్రూప్ చైర్మన్ ) Mr.నక్క రాజు

హైదరాబాద్ ఏప్రిల్ 10 (మహాప్రభ) :ప్రముఖ సామాజిక వేత్త మహేశ్వరం కృష్ణయ్య ఈరోజు ‘నమస్తే మహాప్రభ’ దినపత్రిక ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. పత్రికా కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు యాజమాన్యం మరియు సిబ్బంది సాదర స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా, మహాప్రభ పత్రికా అధినేత మరియు ఆరుహి గ్రూప్ (Aruhi Group) చైర్మన్ Mr.నక్క రాజు కృష్ణయ్య ని ప్రత్యేకంగా కలిశారు. సమాజ సేవలో కృష్ణయ్య అందిస్తున్న సహకారాన్ని కొనియాడుతూ, Mr.నక్క రాజు ఆయనను శాలువాతో కప్పి, స్మృతి చిహ్నంతో ఘనంగా సన్మానించారు.

అనంతరం జరిగిన భేటీలో, సమకాలీన సామాజిక అంశాలు మరియు పత్రికా రంగం పోషిస్తున్న కీలక పాత్రపై వారు చర్చించారు. నిష్పక్షపాత వార్తలతో ‘నమస్తే మహాప్రభ’ పత్రిక ప్రజలకు చేరువవుతున్న తీరును కృష్ణయ్యగారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పత్రికా ప్రతినిధులు మరియు ఆరుహి గ్రూప్ ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.