mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 6:39 am Digital Edition : Namastey Mahaaprabha

నన్ను పట్టుకోగలిగితే పట్టుకోండి.. పంజాబ్ కింగ్స్‌పై ఇషాన్ కిషన్ సెటైర్..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు ఇషాన్ కిషన్ మరోసారి తన ఆటతో పాటు సోషల్ మీడియా పోస్ట్‌తో కూడా వార్తల్లో నిలిచాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

మే 7 ( మహాప్రభ ) :సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు ఇషాన్ కిషన్ (Ishan Kishan) మరోసారి తన ఆటతో పాటు సోషల్ మీడియా పోస్ట్‌తో కూడా వార్తల్లో నిలిచాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది (SRH vs PBKS).

బుధవారం నాటి మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాళ్లు చాలా క్యాచ్‌లు జారవిడిచారు. పంజాబ్ ఓటమికి అదే ముఖ్య కారణమని ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా అభిప్రాయపడ్డాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఇషాన్ కిషన్.. ‘పట్టుకోగలిగితే నన్ను పట్టుకోండి’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కచ్చితంగా పంజాబ్ జట్టును ఉడికించడానికే ఇషాన్ కిషన్ ఈ పోస్ట్ పెట్టాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు (Catch me if you can post).

హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఫీల్డర్లు వరుసగా కీలక క్యాచ్‌లను వదిలేశారు (Ishan Kishan Instagram). ఇషాన్ కిషన్ 9 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఒకసారి, 18 పరుగుల వద్ద మరోసారి అతడి క్యాచ్‌లను జారవిడిచారు. అదేవిధంగా ఒక స్టంపింగ్ అవకాశాన్ని కూడా మిస్ చేశారు. ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకున్న ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.