mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 11:40 am Digital Edition : Namastey Mahaaprabha

ధరణి దోపిడీపై ఉక్కుపాదం: మంత్రి పొంగులేటి

ధరణి దోపిడీపై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ధరణి వ్యవహారంలో తీగ లాగితే డొంక కదిలినట్లు అక్రమాలు బయటపడుతున్నాయని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 18 మహాప్రభ : ధరణి దోపిడీపై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Telangana Minister Ponguleti Srinivasa Reddy) హెచ్చరించారు. సచివాలయంలో ధరణిపై ఉన్నత స్థాయి కమిటీతో మంత్రి పొంగులేటి ఇవాళ(బుధవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ధరణి వ్యవహారంలో తీగ లాగితే డొంక కదిలినట్లు అక్రమాలు బయటపడుతున్నాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ విచారణలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల భారీ దోపిడీ బయటపడిందన్నారు. ధరణి పోర్టల్‌లో లోపాలు సాంకేతికం కాదని.. వ్యవస్థాగతంగా సృష్టించినవేనని తెలిపారు.