mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 5:38 am Digital Edition : Namastey Mahaaprabha

దయనీయ స్థితిలో పాక్ హాకీ జట్టు.. డబ్బుల్లేక గంటల పాటు రోడ్ల పైనే.. : Mahaaprabha

ఫిబ్రవరి 13 మహాప్రభ : నిధుల కొరత కారణంగా పాకిస్థాన్ హాకీ సమాఖ్య అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన పాక్ జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. డబ్బుల్లేక ఆ జట్టు ఆటగాళ్లు గంటల తరబడి రోడ్ల పైనే గడపాల్సి వచ్చింది.నిధుల కొరత కారణంగా పాకిస్థాన్ హాకీ సమాఖ్య అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన పాక్ జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. డబ్బుల్లేక ఆ జట్టు ఆటగాళ్లు గంటల తరబడి రోడ్ల పైనే గడపాల్సి వచ్చింది. హోటల్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆ జట్టు ఆటగాళ్లు, సిబ్బంది గంటల తరబడి రోడ్లపై తిరగాల్సి వచ్చింది (Pakistan hockey team).ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ రెండో రౌండ్ మ్యాచ్‌ల కోసం పాకిస్థాన్ హాకీ జట్టు గత వారం ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రా చేరుకుంది. ఆటగాళ్లకు కాన్‌బెర్రాలో ఓ ఫోర్ స్టార్ హోటల్‌లో గదులు బుక్ చేసినట్టు పాకిస్థాన్ స్పోర్ట్స్ బోర్డ్ సమాచారం ఇచ్చింది. అయితే ఆ గదులకు సంబంధించి హోటల్‌కు చెల్లింపులు మాత్రం జరగలేదు. దీంతో హోటల్ బుకింగ్ రద్దయింది. హోటల్ యాజమాన్యం సూచనల మేరకు పాక్ హాకీ ఆటగాళ్లు గదులు ఖాళీ చేసి లగేజీతో రోడ్డు పైకి రావాల్సి వచ్చింది (Pakistan hockey embarrassment).

హాకీ ఆటగాళ్లు, సిబ్బంది గంటల తరబడి రోడ్ల పైనే తిరిగారు (Pakistan sports news). వారిని చూసిన కొందరు స్థానిక పాకిస్థానీయులు హోటల్ యాజమాన్యంతో మాట్లాడారు. దీంతో హోటల్ యాజమాన్యం పాక్ ఆటగాళ్లకు తిరిగి గదులు కేటాయించింది. పాక్ హాకీ ఆటగాళ్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. అర్జెంటీనాలో జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ మొదటి దశ సమయంలో ఆటగాళ్లకు రోజువారీ భత్యాలు చెల్లించకపోవడంతో విదేశాలలో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.