mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 6:05 am Digital Edition : Namastey Mahaaprabha

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట.. రూ745 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ఆర్థిక బకాయిలను విషయంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 27 మహాప్రభ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ఆర్థిక బకాయిలను విషయంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నాడు ఆయన ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు రూ.745 కోట్ల పెండింగ్ బిల్లు(Pending Bills)లను విడుదల చేశారు. గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన తర్వాత వారికి ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ బిల్లులు విడతల వారీగా క్లియర్ చేస్తోంది.ప్రభుత్వం విడుదల చేసిన రూ.745 కోట్లతో ఉద్యోగులకు పెద్ద ఊరట లభించినట్లయింది. కేవలం ఉద్యోగులకే కాకుండా, గ్రామాల్లో అభివృద్ధి పనులు, పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం అదనంగా రూ389 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ నిధుల విడుదల ద్వారా గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతం కావడంతో పాటు, ఎంతోమంది ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని అంటున్నారు.