mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 6:35 am Digital Edition : Namastey Mahaaprabha

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్..

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్‌తో టీవీకే అధినేత విజయ్‌ 40 నిమిషాల భేటీ తర్వాత ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది.

చెన్నై మే 7 ( మహాప్రభ ) : తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్‌తో టీవీకే అధినేత విజయ్‌ 40 నిమిషాల భేటీ తర్వాత ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. 108 అసెంబ్లీ సీట్లతో టీవీకే అతి పెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్, వీసీకేల మద్దతుతో ఆ పార్టీ బలం 114కు చేరింది.