mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 11:42 am Digital Edition : Namastey Mahaaprabha

డ్రైవర్‌ హత్య కేసులో సాక్షులకు బెదిరింపులు.. అనంత బాబు కోసం పోలీసుల గాలింపు

డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో సాక్షులను వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డబ్బులు ఇచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ బెదిరింపులకు భయపడి నలుగురు సాక్షులు పోలీసులను ఆశ్రయించారు.

కాకినాడ ఏప్రిల్ 22 (మహాప్రభ) : వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును (MLC Anantha Babu) అరెస్ట్ చేసేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఆయన్ను పట్టుకునేందుకు చర్యలు వేగవంతం చేశారు. ఒడిశా, హైదరాబాద్, తమిళనాడు వంటి ప్రాంతాలకు పోలీస్ బృందాలు వెళ్లనున్నాయి. మొత్తం ఐదుగురు సీఐలు, పది మంది ఎస్ఐలతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో సాక్షులను.. అనంత బాబు డబ్బులు ఇచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ బెదిరింపులకు భయపడి నలుగురు సాక్షులు పోలీసులను ఆశ్రయించారు. సాక్షులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అనంత బాబుపై పోలీసులు మరో కేసును నమోదు చేశారు. సాక్షులను ప్రభావితం చేసిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే అనంత బాబు పరారైనట్లు సమాచారం.