mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 7:44 am Digital Edition : Namastey Mahaaprabha

డీలిమిటేషన్‌‌తో ఆ రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం: సీఎం రేవంత్‌ రెడ్డి

అసెంబ్లీ సీట్లలో మహిళా కోటాను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ పేరుతో డీలిమిటేషన్‌ని ముందుకు తేవొద్దని సూచించారు.

హైదరాబాద్ ఏప్రిల్ 13 (మహాప్రభ) : అసెంబ్లీ సీట్లలో మహిళా కోటా వెంటనే అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ పేరుతో డీలిమిటేషన్‌ని ముందుకు తేవొద్దని సూచించారు. డీలిమిటేషన్‌‌‌పై కేంద్రం తీరు సరైనది కాదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మహిళా రిజర్వేషన్, లోక్‌సభ డీలిమిటేషన్ వేర్వేరు అంశాలని ప్రస్తావించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్ పెట్టారు.

జనాభా ఆధారిత డీలిమిటేషన్‌పై ఆందోళనలు చేయొద్దని అన్నారు. దక్షిణ, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డీలిమిటేషన్‌ తాత్కాలిక రాజకీయ లాభమని, కానీ దేశానికి తీరని నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ ప్రయోజనం.. పార్టీ ప్రయోజనాల కంటే ముఖ్యమైనదని చెప్పారు. పోరాటా విధానానికి ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని సూచించారు. డీలిమిటేషన్‌పై అన్ని పార్టీలతో చర్చించి కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు.