mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 9:18 am Digital Edition : MAHAA PRABHA DAILY

టీవీకే, ఎన్డీయే పొత్తుపై నైనార్ నాగేంద్రన్ కార్లిటీ

తమిళనాడులో రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళగ వెట్రి కళగం పార్టీతో, ఎన్డీయే కూటమి గురించి ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.

ఇంటర్నెట్ డెస్క్, మార్చి 9మహాప్రభ  : తమిళనాడులో రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ (Nainar Nagendran) కీలక వ్యాఖ్యలు చేశారు. తంజావూరులో పర్యటించి, పలు కార్యక్రమాల్లో నైనార్ నాగేంద్రన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళగ వెట్రి కళగం పార్టీతో, ఎన్డీయే కూటమి గురించి ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్‌ను ఎన్డీయేలోకి తీసుకురావడానికి చర్చలు జరుగుతున్నాయని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని నైనార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం టీవీకే పార్టీతో బీజేపీ, ఎన్డీయే స్థాయిలో ఎలాంటి చర్చలు జరగడం లేదని తెలిపారు. ఇటీవల విజయ్ ఎన్డీయే కూటమిలో చేరబోతున్నారని సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తంజావూరు ప్రెస్‌మీట్‌లో నైనార్ నాగేంద్రన్ చేసిన ఈ వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాల్లో సాగుతున్న ఊహాగానాలకు కొంత వరకు తెరపడినట్లైంది.