టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 2026-27 హోం సీజన్ షెడ్యూల్ రిలీజ్
భారత క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది. 2026-27కు సంబంధించిన హోం సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే వన్డే మ్యాచులు తొమ్మిది ఉన్నాయి. స్పోర్ట్స్ డెస్క్ మార్చి 26 (మహాప్రభ) : టీమిండియాకు సంబంధించి 2026-27 హోం సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ(గురువారం) విడుదల చేసింది. ఈ సీజన్‌లో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు పర్యటనకు వస్తాయి. 17 వేదికల్లో మొత్తం 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనున్నాయి....