జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వాస్తవాలన్నీ ప్రజల ముందుంచుతాం: బండి సంజయ్
హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి ఆలయాన్ని సందర్శించారాయన. హైదరాబాద్,ఫిబ్రవరి 24 మహాప్రభ : భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతోనే కరీంనగర్‌లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద మొక్కులు తీర్చుకునేందుకే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి ఆలయానికి వచ్చినట్లు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మీ ఆలయం ఎంతో పవర్‌ఫుల్ అని, భవిష్యత్తులో...