mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 5:49 am Digital Edition : Namastey Mahaaprabha

జనగామలో పెద్దపులి సంచారం? : Mahaaprabha

జనగామ మండలంలో పెద్దపులి సంచారం వార్తలు స్థానిక ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. జనగామ, పక్కనే ఉన్న యాద్రాది భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక ఏరియాలో పెద్దపులి సంచారం ఉందని తెలుస్తోంది.

జనగామ ఫిబ్రవరి 4 మహాప్రభ  : జనగామ మండలంలోని సిద్దెంకి, పెంబర్తి, పెద్దరాంచర్లలో పెద్దపులి సంచరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యాద్రాది భువనగిరి జిల్లా ఆలేరు(Aaleru) మండలం కొలనుపాక గ్రామ మీదుగా పెద్దపులి జనగామ(Janagama)కు ప్రవేశించినట్లు రైతులు ఆటవీశాఖ, పోలీసులు సమాచారం అందించారు. దీంతో ఆధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి పులి పాదముద్రలను సేకరించారు. వ్యవసాయ బావుల ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండోచ్చని కావున వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.