జగిత్యాలలో వీడిన చిక్కుముడి.. కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్

ఎట్టకేలకు జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై సస్పెన్స్ వీడింది. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే పార్టీ అధిష్టానం కేటాయించింది. జగిత్యాల, ఫిబ్రవరి 16 మహాప్రభ : తాజా.. మాజీ ఎమ్మెల్యేల మధ్య అధిపత్య పోరు నెలకొన్న వేళ.. జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై సస్పెన్స్ వీడింది. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే పార్టీ అధిష్టానం కేటాయించింది. దాంతో మున్సిపల్ చైర్మన్‌గా ఆయన వర్గానికి చెందిన సమిండ్ల వాణిని ఎంపిక చేశారు. అలాగే వైస్ చైర్మన్ పదవిని...