ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్ జిల్లాలోని కొండ ప్రాంతంలో ప్రైవేటు జెట్ ఒకటి సోమవారంనాడు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో జెట్‌లోని పైలట్, కో-పైలట్ మరణించినట్టు ప్రాథమిక సమాచారం.
రాయపూర్ ఏప్రిల్ 20 (మహాప్రభ) : ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్ జిల్లాలోని కొండ ప్రాంతంలో ప్రైవేటు జెట్ ఒకటి సోమవారంనాడు కుప్పకూలింది. ఆరా హిల్స్‌లో తొలుత చెట్టును ఢీకొని ఆ తర్వాత కుప్పకూలినట్టు స్థానికులు తెలిపారు. దీంతో మంటలు ఎగసిపడి పొగ చుట్టుపక్కలకు వ్యాప్తించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో జెట్‌లోని పైలట్, కో-పైలట్ మరణించినట్టు ప్రాథమిక సమాచారం. జెట్ కుప్పకూలిన సమయంలో అందులో ఇంకెవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.
జెట్ కుప్పకూలిన సమాచారం తెలిసిన వెటనే ఎస్ఎస్‌పీ లాల్ ఉమీద్ సింగ్ సహా సీనియర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.