చైనా సరిహద్దులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ.. రోడ్డుపై దిగిన మోదీ విమానం
భారత ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం చేరుకున్నారు. చైనా సరిహద్దులో ఏర్పాటుచేసిన అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీలోనే ఆయన విమానం దిగింది. ఇంటర్నెట్ డెస్క్, ఫిబ్రవరి 14 మహాప్రభ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అస్సాం పర్యటన నిమిత్తం అక్కడకు చేరుకున్నారు. దిబ్రూగఢ్ - మోరాన్ జాతీయ రహదారిపై నిర్మించిన అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీ రోడ్డుపై మోదీ ప్రయాణించిన ప్రత్యేక విమానం దిగింది. దీంతో అస్సాంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైనట్టయింది. ఆ తర్వాత.. మోదీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఏర్పాటుచేసిన యుద్ధ, రవాణా, ఎయిర్‌క్రాఫ్ట్‌ల...