చట్నీస్‌లో పేలుడు.. పరుగులు తీసిన కస్టమర్లు

ఎల్బీ నగర్‌లోని చట్నీస్ హోటల్‌లో ఇడ్లీ స్టీమర్ పేలడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడంతో కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు హైదరాబాద్, ఫిబ్రవరి 20 మహాప్రభ : ఎల్బీ నగర్‌లోని చట్నీస్‌ హోటల్‌లో(Chutneys Hotel) శుక్రవారం పేలుడు సంభవించింది. హోటల్‌లో ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దఎత్తున పేలుడు శబ్దం రావడంతో హోటల్‌కు వచ్చిన కస్టమర్లు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో హోటల్‌లో పనిచేస్తున్న వారిలో ఒకరి తలకు బలమైన గాయమైంది....