చక్రం తిప్పిన గూడెం మహిపాల్.. ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ గెలుపు

పఠాన్‌చెరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ జోరు కొనసాగుతోంది. ఇక్కడ 5 మున్సిపాలిటీలలో బీఆర్‌ఎస్‌కు అత్యధిక వార్డులు దక్కాయి. సంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 13 మహాప్రభ : పఠాన్‌చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు(Congress) ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS) జోరు కొనసాగుతోంది. ఈ నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో ఏ ఒక్క చోట కూడా కాంగ్రెస్‌కు మెజార్టీ వార్డులు దక్కలేదు. గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలు బీఆర్‌ఎస్‌ కైవసం అయ్యాయి. గుమ్మడిదలలో బీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలుపొందగా, గడ్డపోతారంలో కూడా స్పష్టమైన ఆధిక్యంతో పార్టీ విజయం సాధించింది. మిగిలిన...