mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 6:40 am Digital Edition : Namastey Mahaaprabha

చంచల్‌గూడ జైలు అధికారుల వినూత్న ప్రయోగం

చంచల్‌గూడ జైలు అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణ ప్రజల కోసం జైల్ మ్యూజియం, ఫీల్ ది జైల్ పేరుతో ప్రత్యేక బ్లాక్‌ను ప్రారంభించారు.

హైదరాబాద్ మే 12 ( మహాప్రభ ) : సాధారణ ప్రజల కోసం చంచల్‌గూడ జైలు అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. జైలు ఆవరణలో ‘జైల్ మ్యూజియం’, ‘ఫీల్ ది జైల్’ పేరుతో ప్రత్యేక బ్లాక్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ప్రారంభించారు. ఇప్పటికే గోవా, కోల్‌కతా వంటి ప్రాంతాల్లో జైలు మ్యూజియాలు ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు కూడా ఈ జాబితాలో చేరింది. జైల్ మ్యూజియంలో జైలు చరిత్ర, ఉపయోగించిన పాత వస్తువులు, ఖైదీల జీవితం, శిక్షల విధానాలు వంటి అంశాలను ప్రదర్శించనున్నారు. ఇది విద్యార్థులు, పర్యాటకులు, సాధారణ ప్రజలకు జైలు వ్యవస్థ గురించి అవగాహన కల్పించడానికి ఉపయోగపడనుంది.

‘ఫీల్ ది జైల్’ బ్యారక్ ద్వారా సాధారణ ప్రజలు ఒకరోజు జైలు జీవితాన్ని అనుభవించేలా జైలు అధికారులు అవకాశం కల్పించారు. ఫీజు చెల్లించి రిజర్వేషన్ చేసుకున్నవారు జైలు రూల్స్ ప్రకారం ఒక రోజు బ్యారక్‌లో ఉండి, జైలు ఆహారం, రొటీన్ కార్యకలాపాలు, శిక్షల వాతావరణాన్ని అనుభవించవచ్చు. ఇది జైలు జీవితం ఎంత కష్టమో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అధికారులు తెలిపారు.