ఘోరం.. పిడుగుపాటుకు ఒకరి మృతి, నలుగురికి తీవ్రగాయాలు..
మార్కాపురం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పుల్లలచెరువులోని మొక్కజొన్న ఫ్యాక్టరీపై పిడుగుపడింది. పిడుగుపాటుకు గురై కన్నయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మార్కాపురం ఏప్రిల్ 6 (మహాప్రభ) : ఆంధ్రప్రదేశ్‌లో వరుస పిడుగుపాటులు తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాయి. నిన్న(ఆదివారం) శ్రీకాకుళం, తిరుపతి జిల్లాల్లో పిడుగులు పడి ముగ్గురు మృతిచెందారు. కాగా, నేడు మార్కాపురం జిల్లాలోనూ ఘోర విషాదం చోటు చేసుకుంది. పుల్లలచెరువులోని మొక్కజొన్న ఫ్యాక్టరీపై పిడుగుపడింది. పిడుగుపాటుకు గురై కన్నయ్య(28) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని యర్రగొండపాలెం...