గ్యాస్ కొరత లేకుండా చూసే బాధ్యత మాది: మంత్రి ఉత్తమ్

తెలంగాణ వ్యాప్తంగా అత్యవసర సేవలకు గ్యాస్ కొరత లేకుండా చూసే బాధ్యత మాది.. అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కొంత కొరత ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందన్న ఉత్తమ్.. కేంద్రం, రాష్ట్రాలకు గైడ్ లైన్స్ ఇచ్చిందని వెల్లడించారు. హైదరాబాద్, మార్చి 13 మహాప్రభ : దేశవ్యాప్తంగా నెలకొన్న ఇంధన, గ్యాస్ సరఫరా పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...