ఖమేనీ మృతిపై భారత్ మౌనం.. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సోనియా గాంధీ..
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి సంబంధించి భారత్ మౌనంపై సోనియా గాంధీ స్పందించారు. కేంద్రంపై ఆమె విమర్శలు చేశారు. ఖమేనీ హత్యను కేంద్రం ఖండించకపోవటం తటస్థ వైఖరి కాదని, బాధ్యతలను విస్మరించటమేనని అన్నారు. న్యూఢిల్లీ, మార్చి 3 మహాప్రభ : అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై శనివారం దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్ నాయకులే లక్ష్యంగా టెహ్రాన్‌లోని 30 ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు....