ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. పలు ప్రాంతాలపై క్షిపణులతో దాడు చేసింది. యుద్ధం ముగించాలని కోరుతూ స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఇరు పక్షాలకు సూచించారు.
మార్చి 23 మహాప్రభ : ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. పలు ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. యుద్ధం ముగించాలని కోరుతూ స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఇరు పక్షాలకు ఇటీవల విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆ శాంతి సందేశాన్ని క్షిపణులపై అంటించి మరీ, వాటిని ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ మీడియా విడుదల చేసిన ఓ వీడియోలో ఐఆర్‌జీసీ అధికారి ఒకరు క్షిపణిపై స్టిక్కర్లు అంటిస్తున్నట్టు కనబడుతోంది (Iran missiles).