క్యాతనపల్లిలో అసలేం జరుగుతోంది? ఉద్రిక్తత, లాఠీచార్జ్.. రాజకీయ రణరంగం!

తెలంగాణలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే క్రమంలో ప్రధాన పార్టీల మధ్య సాగుతున్న పోరు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. మంచిర్యాల, ఫిబ్రవరి 17 మహాప్రభ : మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై గత కొన్ని గంటలుగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల ఎత్తుకు పైఎత్తులతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కిడ్నాప్ ఆరోపణలు - ఫిర్యాదులు మున్సిపల్ కార్యాలయంలో ఈ ఉదయం నుంచే...