కొమురంభీం జిల్లాలో మావోల కదలికలు.. రంగంలోకి పోలీసులు.. :Mahaaprabha

కొమురంభీం జిల్లాలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. తిర్యాణి మండలం పంగిడిమాదారం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి.. కొమురంభీం జిల్లా, ఫిబ్రవరి 9 మహాప్రభ : జిల్లాలోని తిర్యాణి మండలం పంగిడిమాదారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. గ్రేహౌండ్స్ బలగాలు ఈ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి మావోయిస్టుల సామగ్రిని గుర్తించాయి. అయితే పోలీసుల సమాచారం ముందుగానే తెలుసుకున్న మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలిలో మావోలు ఉపయోగించిన వంటపాత్రలు,...