mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 8:55 am Digital Edition : Namastey Mahaaprabha

కొమురంభీం జిల్లాలో మావోల కదలికలు.. రంగంలోకి పోలీసులు.. :Mahaaprabha

కొమురంభీం జిల్లాలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. తిర్యాణి మండలం పంగిడిమాదారం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి..

కొమురంభీం జిల్లా, ఫిబ్రవరి 9 మహాప్రభ : జిల్లాలోని తిర్యాణి మండలం పంగిడిమాదారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. గ్రేహౌండ్స్ బలగాలు ఈ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి మావోయిస్టుల సామగ్రిని గుర్తించాయి. అయితే పోలీసుల సమాచారం ముందుగానే తెలుసుకున్న మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలిలో మావోలు ఉపయోగించిన వంటపాత్రలు, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.జిల్లాలో ఎలాంటి అనుమానాస్పద కదలికలు గమనించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. మావోయిస్టుల కదలికలతో జిల్లాలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కాగా, గత ఏడాది డిసెంబర్‌లో జిల్లాలోని పెడల్‌దోబా గ్రామంలో 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా కొమురంభీం ఆసిఫాబాద్ – మంచిర్యాల డివిజనల్ కమిటీ సెక్రటరీ ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ సహా 41 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు.