mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 6:26 am Digital Edition : Namastey Mahaaprabha

కొత్త పార్టీ పేరు ప్రకటించిన కవిత..

కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన(TRS)గా ప్రకటించారు. మేడ్చల్ మల్కాజిగిరి మునీరాబాద్‌ వేదికగా పార్టీ జెండాను, పేరును వెల్లడించారు.

మేడ్చల్ మల్కాజిగిరి ఏప్రిల్ 25 (మహాప్రభ) : మునీరాబాద్‌ వేదికగా కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును వెల్లడించారు. పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన(TRS)గా కవిత ప్రకటించారు. దీంతో తెలంగాణ గడ్డపై మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించినట్లు అయ్యింది. పసుపు, ఆకుపచ్చ, బ్లూ కలర్లతో పార్టీ జెండాను కవిత ఆవిష్కరించారు. జెండాపై బ్లూ రంగుతో తెలంగాణ చిత్రపటం ఉంది. దానిపై తెలుపు రంగులో టీఆర్ఎస్ పేరుతో ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి. పార్టీ రంగులైన బ్లూ, ఆకుపచ్చ చీరతో కవిత సభా ప్రాంగణానికి వచ్చారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన కవిత.. తెలంగాణలో కొత్త విప్లవం మెుదలైందని అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో నూతన రాజకీయ శక్తిగా రాబోతున్నట్లు తెలిపారు. తన జీవితంలో ఇది మర్చిపోలేని రోజు అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరి భాగస్వామ్యం అవసరమని కోరారు. తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడి పిడికిలి బిగించి కొట్లాడినట్లు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి కీలకపాత్ర పోషించిందన్నారు కవిత.