mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 12:16 pm Digital Edition : MAHAA PRABHA DAILY

కేంద్ర కేబినెట్ సమావేశం.. ప్రభుత్వ నిర్ణయాలు ఇవీ

కేంద్ర కేబినెట్ తాజా సమావేశంలో పలు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మౌలిక వసతుల కల్పనకు రూ.8.8 లక్షల కోట్లు కేటాయించేందుకు నిర్ణయించింది.

ఇంటర్నెట్ డెస్క్ మార్చి 10 మహాప్రభ  : తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.8 లక్షల కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక జల్ జీవన్ మిషన్ పొడింపు కోసం మరో రూ.8.7 లక్షల కోట్లను కేటాయించింది. ముధురై ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇక సంత్రాగచ్చి-ఖరగ్‌పూర్ మద్య రూ.2,905 కోట్లతో నాలుగు లైన్ల రహదారి, రూ.3,839 కోట్లతో బద్నావర్-థాండియా-తిమర్వానీ మధ్య 5 లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.3,631 కోట్లతో జెవార్ విమానాశ్రయం-ఫరీదాబాద్ సెక్షన్‌ను కలిపే 6 లైన్ల ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.