కృషి, పట్టుదలతో విజయాలు
నమ్మకం, కృషి, పట్టుదల ఉంటే విజయాలు సాధించవచ్చునని సినీనటుడు శర్వానంద్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. కురబలకోట(చిత్తూరు) మార్చి 27 (మహాప్రభ) : నమ్మకం, కృషి, పట్టుదల ఉంటే విజయాలు సాధించవచ్చునని సినీనటుడు శర్వానంద్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. మండలంలోని మిట్స్ యూనివర్శిటీలో రెండు రోజుల జాతీయ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ అశ్వ్-2కె26 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.తల్లిదండ్రులు తమ పిల్లలను పక్కవారితో పోల్చి నిరుత్సాహపరచడం మానుకోవాలన్నారు. పిల్లలను ఉత్సాహపరిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. విద్యార్థులు జీవితంలో ఒక నిర్ధిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకుని సాధించడానికి...