mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 5:23 am Digital Edition : Namastey Mahaaprabha

కాపులను ఇబ్బంది పెట్టి ‘తగ్గేదేలే’ అంటూ సైగలా.. అంబటిపై పంచుమర్తి ఫైర్ : Mahaaprabha

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను నిత్యం భయభ్రాంతులకు గురిచేసే క్రిమినల్ అంబటి రాంబాబు అంటూ మండిపడ్డారు.

అమరావతి, ఫిబ్రవరి 13 మహాప్రభ : మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై (Ambati Rambabu) శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హీరో అల్లు అర్జున్ కూడా సిగ్గుపడేలా అంబటి సైగలు ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు. ప్రజలను నిత్యం భయభ్రాంతులకు గురిచేసే ఓ క్రిమినల్ అంబటి రాంబాబు అంటూ ఫైర్ అయ్యారు. అన్ని వర్గాల ప్రజలను అడ్డగోలుగా దోచుకుని.. ఇప్పుడు కులం కార్డు బయటకు తీశారని మండిపడ్డారు. అరాచక శక్తులకు కులం కార్డు తీసే అర్హత లేదన్నారు.

‘బీసీలు, ఆర్యవైశ్యులను అడ్డగోలుగా దోచుకున్న రాజకీయ ఉగ్రవాది అంబటి రాంబాబు’ అని అనురాధ విమర్శించారు. మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను జగన్ తిట్టించినప్పుడు అంబటికి కాపు కులం గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. కాపులతో పాటు అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టిందే కాకుండా తగ్గేదేలే అంటూ సైగలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసే రాంబాబుకు.. కుటుంబ సభ్యులు ఆనాడే గడ్డిపెట్టి ఉంటే, నేడు వారు రోడ్డెక్కాల్సిన పని ఉండేది కాదని పంచుమర్తి అనురాధ హితవుపలికారు. కాపులు తాగుబోతులంటూ అంబటి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా అనురాధ మీడియాకు వినిపించారు.