కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత..
గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కల్వకుంట్ల కవిత విమర్శించారు. 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పుకుంటూ.. మరోవైపు 15 లక్షల కార్డులు తొలగించే ప్రయత్నం జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ ఏప్రిల్ 1 (మహాప్రభ) : కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో పేదలను రేవంత్ రెడ్డి సర్కార్ వేధిస్తోందని మండిపడ్డారు. రేషన్ కార్డుల విషయంలో పేదలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు....