mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 7:25 am Digital Edition : Namastey Mahaaprabha

కాంగ్రెస్‌ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్న హైడ్రా కమిషనర్‌

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కాంగ్రెస్‌ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. కూకట్‌పల్లి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు.

  • రంగనాథ్‌పై కేంద్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం
  • ముస్లిం గ్రేవ్‌యార్డుపై రాజకీయం తగదు

హైదరాబాద్,ఫిబ్రవరి 25 మహాప్రభ: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కాంగ్రెస్‌ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) మండిపడ్డారు. కూకట్‌పల్లి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. సున్నం చెరువులో ఐదెకరాల భూమిని వదిలేసి హైడ్రా అధికారులు ఎలా కంచె వేస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న పెద్ద పెద్ద బిల్డర్లను భయపెట్టే ప్రయత్నిం చేస్తున్నారని, నేను స్వయంగా ఫోన్‌ చేసినా స్పందించడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌(BRS) హయాంలో అభివృద్ధి చేసిన ఐడీఎల్‌, మైసమ్మ చెరువు, సున్నం చెరువు పరిసరాల్లో కనీసం లైట్లు కూడా నేడు వెలగడం లేదన్నారు.

ముస్లిం గ్రేవ్‌యార్డ్‌ విషయంలో కూడా హైడ్రా కమిషనర్‌ జోక్యం చేసుకుంటూ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్‌ తీరుపై సెంట్రల్‌ విజిలెన్స్‌తోపాటు కేంద్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కృష్ణారావు అన్నారు. అభివృద్ధి కోసం హైడ్రా అధికారులకు సహకరిస్తామని, పేదల జోలికి వస్తే ఊరుకోబోమన్నారు. సున్నం చెరువుపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు.