కల్తీ పాల ఘటన.. ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరం

కల్తీ పాల ఘటనలో 15 మంది బాధితులు ఇంకా ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 28 మహాప్రభ : రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీ పాల ఘటనలో బాధితులకు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 15 మంది బాధితులు ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అలాగే 11 మందికి వెంటిలేటర్‌పై వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు. బాధితులకు మరింత మెరుగైన చికిత్స కోసం...