mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 9:16 am Digital Edition : MAHAA PRABHA DAILY

కరూర్ కేసు: విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు

ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంగా మారింది. విజయ్ తన రాజకీయ పార్టీ టీవీకేను ప్రకటించి, వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ సీబీఐ నోటీసులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇంటర్నెట్ డెస్క్, మార్చి 9  మహాప్రభ : ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్‌కు (Tamil Actor Vijay) సీబీఐ (CBI) నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంగా మారింది. విజయ్ తన రాజకీయ పార్టీ టీవీకేను ప్రకటించి, వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ సీబీఐ నోటీసులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కరూర్ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు సీబీఐ అధికారులు విజయ్‌ను విచారణకు రావాలని కోరుతూ నోటీసులు పంపారు. నోటీసులపై స్పందించిన విజయ్, అధికారులకు లిఖితపూర్వక సమాధానం పంపారు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్, ఇతర కారణాల వల్ల మంగళవారం జరగాల్సిన విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. విచారణకు సిద్ధమవ్వడానికి, హాజరు కావడానికి తనకు కనీసం 10 రోజుల సమయం కావాలని సీబీఐని కోరారు. గడువు ముగిసిన తర్వాత విచారణకు తప్పకుండా హాజరవుతానని తన లేఖలో పేర్కొన్నారు.

సీబీఐ తదుపరి చర్యలు..

విజయ్ అభ్యర్థనపై సీబీఐ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. విజయ్ కోరిన 10 రోజుల గడువును పరిగణనలోకి తీసుకుని విచారణ తేదీని మార్చాలని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే తదుపరి విచారణ ఎప్పుడు ఉంటుందనేది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. విజయ్ అభిమానులు, పార్టీ శ్రేణులు దీనిని రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తున్నారు. కరూర్ జిల్లాకు సంబంధించిన ఈ కేసు పాతదైనప్పటికీ, ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడం చర్చకు దారితీసింది.