ఐపీఎల్‌ వల్ల కెరీర్ నాశ‌న‌మైంది… ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్సన్ ఐపీఎల్‌పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ వ‌ల్ల త‌న కెరీర్ నాశ‌న‌మైందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 7 (మహాప్రభ) : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) వల్ల తన కెరీర్ నాశనమైందంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్సన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓ యూట్యూబ‌ర్‌కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో పీట‌ర్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో పాల్గొనడంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారులతో తలెత్తిన వివాదం కారణంగా తన అంతర్జాతీయ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయిందని...