mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 8:29 am Digital Edition : Namastey Mahaaprabha

ఐఏఎస్‌ రాహుల్‌రాజ్‌కు 6 నెలల జైలు శిక్ష – మెదక్‌ జిల్లా

మెదక్‌ జిల్లా – ఫిబ్రవరి 18 (మహాప్రభ) : కోర్టు ధిక్కరణ కేసులో మెదక్‌ జిల్లా కలెక్టర్‌, ఐఏఎస్‌ అధికారి శ్రీరాహుల్‌రాజ్‌కు హైకోర్టు ఆరునెలల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో మెదక్‌ జిల్లా కలెక్టర్‌, ఐఏఎస్‌ అధికారి రాహుల్‌రాజ్‌కు హైకోర్టు ఆరునెలల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధించింది. చేగుంట మండలం బోనాల్‌ గ్రామంలో ఓ భూవివాదానికి సంబంధించి తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు ఈ శిక్ష వేసింది. అప్పీల్‌ చేసుకోవడానికి వీలుగా జైలు శిక్ష అమలును నాలుగువారాలపాటు నిలిపేస్తున్నట్లు పేర్కొంది. నాగవెళ్లి లక్ష్మి అనే మహిళకు సంబంధించిన భూవివాదంలో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసి, మరోసారి విచారణ జరపాలని హైకోర్టు కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో లక్ష్మి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలుచేశారు. దీనిపై జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాలను కలెక్టర్‌ ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినట్లు భావించిన ధర్మాసనం.. జైలుశిక్ష, జరిమానా విధించింది. అయితే, ఈ విషయమై కలెక్టర్‌ కార్యాలయ వర్గాలు స్పందిస్తూ.. భూ తగాదా విషయమై కొంత కాలంగా లక్ష్మి విచారణకు హాజరు కావడం లేదని తెలిపాయి. ఈ మేరకు ఆమెకు నోటీసులు సైతం పంపామని పేర్కొన్నాయి.