ఏసీ వాటర్ వివాదం.. అన్నాచెల్లెలిపై బ్లేడ్‌తో దాడి

ఏసీ వాటర్ పడుతున్నాయనే కారణంగా అన్నాచెల్లెలిపై బ్లేడ్‌తో దాడి చేసిన ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కాకినాడ ఏప్రిల్ 10 (మహాప్రభ) : చిన్న, చిన్న విషయాలకే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో చూశాం. కూర్చుని మాట్లాడుకోవాల్సిన విషయాల్లో కూడా కత్తులు, రాడ్లతో దాడులకు తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు. ఈ ఘటనల్లో కొందరు గాయాలపాలై బయటపడుతుండగా.. మరికొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోతున్న పరిస్థితి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఏసీ వాటర్ విషయంపై తలెత్తిన...