mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 6:46 am Digital Edition : Namastey Mahaaprabha

ఏపీ వ్యాప్తంగా జోరుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జోరుగా సాగుతోంది. ఉదయం 8 గంటలకే రాష్ట్రవ్యాప్తంగా 45 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు.

అమరావతి మే 1 ( మహాప్రభ ) : రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల(NTR Bharosa Pensions) పంపిణీ ఈరోజు(శుక్రవారం) ఉదయం నుంచి జోరుగా కొనసాగుతోంది. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డుల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు పింఛన్లను అందజేస్తున్నారు. ఉదయం 8 గంటలకే రాష్ట్రవ్యాప్తంగా 45 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మొత్తం రూ.63,158 కోట్ల పింఛన్లను వెచ్చించినట్లు అధికారులు తెలిపారు.

నేడు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పమిడిముక్కలలోని ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సీఎం అందించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పమిడిముక్కల గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పసుపు తోరణాలు, స్వాగత ఫ్లెక్సీలతో గ్రామ వీధులు కళకళలాడుతున్నాయి. ప్రజా వేదిక, కార్యకర్తల సమావేశ ప్రాంగణం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రాక కోసం గ్రామస్థులు, తెలుగు తమ్ముళ్లు ఎదురుచూస్తున్నారు.