లిక్కర్ స్కామ్ ద్వారా సుమారు రెండు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనపై ఐటీ ఫోకస్ పెట్టింది. త్వరలోనే పలువురు నిందితులకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.
అమరావతి మే 2 ( మహాప్రభ ) : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. లిక్కర్ స్కామ్ ద్వారా సుమారు రెండు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనపై ఐటీ ఫోకస్ పెట్టింది. రూ.2000 కోట్లకు సంబంధించిన ట్యాక్స్ వివరాలను ఐటీ సేకరించే పనిలో పడింది. త్వరలోనే పలువురు నిందితులకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. అక్రమంగా సంపాదించిన డబ్బును ఒకచోట నుంచి మరోచోటికి తరలించడానికి హవాలా మార్గాన్ని ఎంచుకున్నట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. డబ్బు తరలింపు విధానంపై ఐటీ బృందం ప్రత్యేక దృష్టి సారించింది. హవాలా ద్వారా నిధులను దుబాయ్‌కు తరలించినట్లు ఐటీ గుర్తించింది. నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయల అక్రమ నగదు జనరేట్ చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. డిస్టిలరీల నుంచి వెండర్లకు ఐదు రెట్లు ఎక్కువ చెల్లింపులు చేసినట్లు గుర్తించింది. ఎలాంటి మెటీరియల్ సరఫరా చేయకుండానే రెండు డిస్టిలరీలు ఫేక్ ఇన్‌వాయిస్‌లు సృష్టించి 76.92 కోట్ల రూపాయలను తరలించినట్లు దర్యాప్తులో బయటపడింది. డిజిటల్ ట్రైల్‌ను తప్పించుకోవడానికే మొత్తం లాభాలను బ్లాక్ మనీగా దాచిపెట్టినట్లు ఐటీ గుర్తించింది.